WNI NEWS జహీరాబాద్ 21 డిసెంబర్ 2023:- బీ ఆర్ ఎస్ లీడర్స్ కి మరియు సౌమ్యుడైనా ఎమ్మెల్యే కి ఎప్పుడు హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, కోచింగ్ సెంటర్స్ ఓపెనింగ్స్ మరియు క్రికెట్ టోర్నమెంట్ మీద వున్న శ్రద్ధ గానీ ఆసక్తి గానీ ప్రజల సమస్యల మీద లేదు అని బీజేపీ మహిళా మోర్చ అసెంబ్లీ కన్వీనర్ జ్యోతి పండాల్ మండి పడ్డారు.ఒక పక్క చెరుకు రైతు కార్మికుల బాక్కయీలు రాక, చక్కర కార్మాగారం నడవక పోవడం వల్ల నానా బాధలు పడుతుంటే మీకు క్రికెట్ టోర్నమెంట్ కావాల్సి వచ్చిందా అని జ్యోతి పండాల్ ప్రశ్నించారు.ఎలక్షన్స్ కి రెండు రోజుల ముందు రైతుల సమస్యలను తీరుస్తాము అని అన్నారు మరి కాకపోతే ఆస్తులు అమ్మైన సరే రైతుల బక్కాయీలు చెల్లి స్తాము అని అన్నారు మరి మీ ఆస్తులు ఎప్పుడు అమ్మి రైతుల బాక్కయీలు తీరుస్తారో చెప్పాలి అని జ్యోతి పండాల్ ప్రశ్నించారు.