WNI NEWS హైదరాబాద్ డిసెంబర్ 1, 2023: సమాజాన్ని కులమతాల పేరుతో విభజించడం భావ్యం కాదని, పాత్రికేయులుగా గొప్ప విలువలతో నార్ల జీవించారని వీక్షణం ఎడిటర్ శ్రీ. ఎన్. వేణు గోపాల్ అభిప్రాయబడ్డారు. డా బీ. ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సటీ లో ప్రఖ్యాత జర్నలిస్ట్, సంపాదకులు నార్ల వెంకటేశ్వర రావు స్మృత్యర్థం ప్రతి ఏడాది నిర్వహించే నార్ల స్మారకోపాన్యాసంలో ప్రముఖ జర్నలిస్ట్, వీక్షణం సంపాదకులు శ్రీ .ఎన్. వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని “తెలుగు జర్నలిజం ప్రయాణం – ఎక్కడినుంచి ఎక్కడిదాకా” అనే అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ నార్ల తరం నాటి పాత్రికేయ విలువలు ప్రస్తుత పరిస్థితులలో లేవని, ఇది సమాజానికి మంచిది కాదని ఆవేదన వ్యక్తపరిచారు. నార్ల తొలితరo తెలుగు జర్నలిజనికి ఆధ్యుడు అని, జర్నలిస్ట్ గా బ్రతికినంత కాలం పాత్రికేయ విలువలకు నిలువుటద్దంగా నిలిచారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆధునిక జర్నలిజం పేరుతో వృత్తిని వ్యాపారమయం చేసారని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య. కె సీతా రామారావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో నార్ల లాంటి పాత్రికేయులు సమాజానికి చాలా అవసరం అన్నారు. విలువలతో కూడిన పాత్రికేయం ఆదర్శంగా నిలుస్తుందని, నార్ల కుటుంబ సభ్యులు ఆయన రాసిన, సేకరించిన పుస్తకాలను అంబేద్కర్ విశ్వవిద్యాలయ లైబ్రరీకి అందించడం గర్వకారణంగా పేర్కొన్నారు. నార్ల లైబ్రరీలో ఉన్న అన్ని పుస్తకాలను త్వరలోనే డిజిటలైజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న విశ్వవిద్యాలయం అకడమిక్ డైరెక్టర్ ప్రొ.ఘంటా చక్రపాణి కార్యక్రమ ఆవశ్యకత గురించి వివరించారు. నార్ల పట్టుదల, విలువలతో కూడిన పాత్రికేయులుగా జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచారు అని పేర్కొన్నారు. ప్రధాన వక్త శ్రీ ఎన్. వేణు గోపాల్ గురించి ప్రో. గుంటి రవి సభకు పరిచయం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొ.ఎ.వి.ఆర్.ఎన్ రెడ్డి; జి.ఆర్.సీ.ఆర్ & డీ డైరెక్టర్, ప్రొ.ఇ.సుధా రాణి; ఈ.ఎం.ఆర్ & ఆర్.సీ డైరెక్టర్, ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. ఎల్వీకే రెడ్డి, అన్ని విభాగాల అధిపతులు, డీన్స్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని నార్లగారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.