0 1 min 11 mths

మాజీ మంత్రి వర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారు

WNI NEWS (జహిరాబాద్) 9 డిసెంబర్ 2023:

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ ఆదేశాల మేరకు బస్సుల్లో శనివారం నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అని అన్నారు . పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్ సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చని తెలిపారు   మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్ లు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంన్నరు
హైదరాబాద్ లోని అసెంబ్లీ ప్రాంగణంలో
నేడు శనివారం  (తేది:09.12.2023) మధ్యాహ్నం 1:30 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.  సీఎం గారు ప్రారంభించగానే శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్ ప్రయాణం మహిళలకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. 

*మహిళలకు ఉచిత ప్రయాణ మార్గదర్శకాలివే!*

-పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తింపు

-తెలంగాణ రాష్ట్ర నివాసిత మహిళలకే ఉచిత ప్రయాణం వర్తింపు

-స్థానికత ధ్రవీకరణ కోసం గుర్తింపు కార్డులను ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించాలి

-కిలోమీటర్ల ప్రయాణ పరిధి విషయంలో ఎలాంటి పరిమితుల్లేవు.

-ప్రయాణించే ప్రతి మహిళకు జీరో టికెట్ మంజూరు చేయబడుతుంది.

-అంతర్రాష్ట్ర సర్వీసులకు తెలంగాణ పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం వర్తింపు.

“కొత్తగా కొలువుదీరిన రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. శనివారం (తేది:09.12.2023) నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం  నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ పూర్తిస్థాయిలో సన్నద్దమైంది.
 
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలందరూ టీఎస్ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరారు.