WNI NEWS జహీరాబాద్,19 డిసెంబరు 2023:ఈ నెల 23వ తేదీ నుంచి జహీరాబాద్ ప్రీమియం లీగ్ క్రికెట్ టౌర్నమెంట్ను పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నయిం తెలిపారు. మెగా టోర్నమెంట్ 20 జట్లు పొల్గొంటున్నాయన్నారు. టోర్ని మొదటి విజేతలకు 50వేలు, రన్నర్ జట్టుకు రూ. 30 వేల నగదు బహుమతులను అందచేయనున్నామ న్నారు. మొదటిబహుమతి స్పాన్సర్గా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబీ పాటిల్, రెండవ బహుమతి స్పాన్సర్ గా బిఆర్ఎస్ నాయకులు దేశెట్టి పాటిల్లు నిలుస్తున్నారన్నారు. క్రికెట్ అభిమానులు టోర్నమెంట్ను వీక్షించేందుకు స్టేడియంలో తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు నయిం వివరించారు.