WNI NEWS జహీరాబాద్ 4 ఫిబ్రవరి 2024::- మహ్మదాబాద్ మండలం పగిడాల గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి కుమారునీపై ప్రేమ వ్యవహారంపై మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో ఎస్సై సురేష్ 50 వేలు డిమాండ్ చేశారు, బాధితులు అడ్వాన్స్గా గా 30,000 చెల్లించారు, మిగతా నగదు పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న జిరాక్స్ సెంటర్ యజమాని మూసాకి 20,000 డబ్బులు చెల్లించాలని, లేనియెడల మీ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేస్తామాని ఎస్సై బెదిరింపులకు పాల్పడడంతో కృష్ణారెడ్డి ఏసీబీ అధికారులు సంప్రదించారు, ఆదివారం 8 గంటల 45 నిమిషాల సమయంలో జిరాక్స్ యాజమానీ మూసాకి బాధితులు 20 వేల డబ్బు చెల్లిస్తూ ఉండడంతో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు ,ఎస్సై సురేష్ పై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు