WNI NEWS జహీరాబాద్ 4 ఫిబ్రవరి 2024::_హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు బయలుదేరి వెళుతున్న శ్రీ దత్తాత్రేయ స్వామి భక్తులకు జహీరాబాద్ లో ఘన స్వాగతం పలకడం జరిగింది. జాతీయ రైతు నేత, బిజెపి నాయకులు, సామాజిక ఉద్యమకారులు ఢిల్లీ వసంత్ మరియు ఆయన బృంద సభ్యులు స్థానిక పస్తాపూర్ శివారులోని అయ్యప్ప స్వామి మందిరంలో కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా గురు పరంపరకు ఆద్యుడు శ్రీ దత్తాత్రేయ స్వామి అని కొనియాడారు. త్రిమూర్తి స్వరూపుడు అయిన దత్తాత్రేయ స్వామి మహత్యం తెలియజేసే గురు చరిత్ర గ్రంథాన్ని ప్రామాణికమైనది గా వర్ణించారు. సామాజిక విలువలను పటిష్టం చేసే భక్తి ఉద్యమాలు దేశానికి ఎంతైనా అవసరమని చర్చించారు. ఈ సందర్భంగా భక్తులకు ఢిల్లీ వసంత్ బృందం పాదపూజ చేసి మంగళ హారతితో స్వాగతం తెలిపి ప్రసాద వితరణ చేశారు. ధర్మకర్త వేణుగోపాల్, పండిత్ బద్రి నారాయణ పంతులు, మాత కుసుమ దేవీలు జహీరాబాద్ ప్రజలకు ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ వసంత్ తో పాటు, అశోక్ పాటిల్, మాధవ రెడ్డి, విశ్వనాథ్ యాదవ్, జ్యోతి పండాల్, సుధీర్ బండారి, శివ భక్తులు శేఖర్, ప్రవీణ్, మహేష్, రాజు, సురేష్ , భూమన్ స్టీవెన్సన్, విష్ణువర్ధన్, అంజి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.