0 1 min 9 mths

WNI NEWS జహీరాబాద్ 29 జనవరి 2024 :- నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభంపై సిఫార్సుల కమిటీ ఏర్పాటు పై అర్షం వెక్తం చేసిన బీజేపీ మహిళా మోర్చ అసెంబ్లీ కన్వీనర్ జ్యోతి పండాల్. బీ ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేస్తూ మళ్ళీ ఫ్యాక్టరీ నీ వెంటనే నడిచేలా చూడాలని జ్యోతి పండాల్ ప్రభుత్వాన్ని కోరారు. కానీ ఫ్యాక్టరీ సమస్యలని రివ్యూ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి రెండు నెలల వ్యవధి తీసుకోకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రివ్యూ ప్రాసెస్ నీ పూర్తి చేయాలని జ్యోతి పండాల్ కోరారు. అలాగే ఈ సుగర్ కేన్ ఫ్యాక్టరీ నీ మును ముందు ఏ ప్రభుత్వం కూడా మళ్ళీ ఇలాంటి సమస్యలు చేయకుండా చాలా కట్టు దిట్ట మైన పాలసీలు, లీగల్ గా చట్టపరమైన రూల్స్ నీ కూడా కంపెనీ కి సంబంధించిన లీగల్ ప్రాసెస్ లో పొందు పర్చాలని జ్యోతి పండాల్ ప్రభుత్వాన్ని కోరారు.