WNI NEWS జహీరాబాద్ 27 జనవరి 2024:_ శంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నీ హై కోర్ట్ నిర్మాణానికి ఇవ్వొద్దు అని శాంతి యుత నిరసనను చేపట్టిన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి జాన్సి పై పోలీసుల తీరుని తప్పుపడుతు మండిపడ్డారు రాష్ట్ర పూలే అవార్డ్ గ్రహీత బీజేపీ మహిళా మోర్చ అసెంబ్లీ కన్వీనర్ జ్యోతి పండాల్. ఆ అమ్మాయి ఎమ్మన్న తప్పు చేసిందా, ఎవరినైనా మర్డర్ చేసిందా, ఎవరినైనా కొట్టినదనా ఆ అమ్మాయినీ జుట్టు పట్టుకొనీ తీసుకెళ్ళడానికి అని జ్యోతి పండాల్ వ్యాఖ్యనించారు. మహిళా పోలీసులు మరో మహిళా పట్ల ప్రవర్తించిన తీరు సిగ్గు చేటు అని జ్యోతి పండాల్ మండి పడ్డారు. జాన్సీ పట్ల హేయంగ ప్రవర్తించిన మహిళా పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని జ్యోతి పండాల్ డిమాండ్ చేశారు.