WNI NEWS జహీరాబాద్ 8 జనవరి 2024:- సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో రంజోల్ ఎస్సీ గురుకుల హాస్టల్ లో విషాదం చోటు చేసుకుంది. జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రంజోల్ ప్రభుత్వ ఎస్ సి బాలికల గురుకుల హాస్టల్ లో బేగరి రాజు కుమార్తె బేగరి స్వప్న అనే బైపిసి మొదటి సంవత్సరం విద్యార్థిని ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య కు కారణాలు తెలియరాలేదు. కాగా మృతురాలు స్వప్న ఈ గురుకుల హాస్టల్ లో 5వ తరగతి నుండి చదువుతోంది. ఈ రోజు మధ్యాహ్నం 2-30గంటల వరకు అక్కడి బోధనా సిబ్బంది, తోటి విద్యార్థులకు కనపడిందని, స్టడీ హావర్స్ కావడం తో రూములో బుక్స్ తీసుకొని వస్తానని వెళ్లిన స్వప్న రాకపోవడంతో, రూమకెళ్ళి చూసిన క్లాస్ టీచర్ ఆమె హస్టల్ రూమ్ లో ఉరేసుకుని, ఆత్మహత్య కు పాల్పడి, శవమై కనిపించిందని హాస్టల్ వర్గాలు తెలిపాయీ. అనంతరం జహీరాబాద్ రూరల్ పోలీసులకు సమాచారం అందించగా, వారు కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్దకు విద్యార్థిని కుటుంబ సభ్యులు చేరుకొని తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె మృత్తికి గల కారణాలు తెలపాలని గురుకుల హాస్టల్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు.