0 1 min 10 mths

WNI NEWS జహీరాబాద్ 3 జనవరి 2024:: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం కు చెందిన సంఘ సేవకురాలు బీజేపీ మహిళ మోర్చా అసంబ్లీ కన్వీనర్ జ్యోతి పండాల్ కు ఈ రోజు శ్రీమతి సావిత్రి బాయి 193 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో రవీంద్ర భారతి ఆడిటోరియంలో పురష్కారం అందుకొన్నారు. ఈ పురస్కారం పొలిటీషియన్, సోషల్ వర్కర్, ఫిలాన్ త్రోపిస్ట్, ఫెమినిస్ట్ కేటగిరీ లో మరియు జహీరాబాద్ పట్టణంలో ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతున్న సందర్భంగా ఆమెకు ఈ అవార్డును అందజేసారు. ఈ సందర్భంగా జ్యోతి పండాల్ మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకే ప్రత్యేక రాజకీయాల్లోకి రావడం జరిగిందని తెలిపారు. నేను 6 నెలల నుండి నిర్విరామంగా మన జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలకు సేవ చేసినందుకు గాను ఈ పురస్కారం అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె జహీరాబాద్ ప్రజానీకానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు.