WNI NEWS జహీరాబాద్ 1 జనవరి 2024 : జహీరాబాద్ డివిజన్ ఎస్టీయు కార్యకర్తల సమావేశానికి హాజరైన ఎస్ టి యు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సయ్యద్ సాబెర్, శ్రీనివాస రాథోడ్ లు మాట్లాడుతూ . … విద్యా రంగంలో అభివృద్ధి కోసం అని ప్రవేశపెట్టిన ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం వల్ల ఉపాధ్యాయులు క్లర్కుగా మారారని అదేవిధంగా ఉన్నత పాఠశాలలో ఉన్నతి పేరుతో కార్యక్రమాన్ని అమలుపరుస్తూ హై స్కూల్ స్థాయి విద్యార్థుల విద్య ఆగం చేస్తున్న ఈ విధానాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్య బోధన ఉపాధ్యాయుల స్వేచ్ఛకు సంబంధించిన అంశమని దానికి విరుద్ధంగా లెసన్ ప్లాన్లు, యూనిట్ ప్లాన్లు, ఇయర్ ప్లాన్లు, డైరీలు రాయాలని రాసిన ప్రకారమే చెప్పాలని నిబంధనలు విధిస్తూ రాయని వారి మీద కఠిన శిక్షలు ఉంటాయని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉపాధ్యాయులు విద్యను బోధించకుండా కలరికల్ పనికె పరిమితం చేసిన ఈ విధానాన్ని వెంటనే పునః పరిశీలించాలని అలాగే బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ,జిపిఎఫ్ , ఎంబర్స్మెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర పెండింగ్ ఆర్థిక బిల్లులను క్లియర్ చేయాలని ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఒకటో తారీఖున జీతాలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఆర్థిక కార్యదర్శి రమణకుమార్ ,రాష్ట్ర కార్యదర్శి ఎంఏ హఫీజ్ ,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు బషీర్ అహ్మద్, ఇస్సాముద్దీన్ ఖాద్రీ ,సుందర్ రావు, సామి ,రియాజ్ అహ్మద్ ఖాన్, షకీల్ అహ్మద్ ,సమద్ తదితరులు పాల్గొన్నారు.