0 1 min 10 mths

WNI NEWS జహీరాబాద్ 29 డిసెంబర్ 2023: ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం దరఖాస్తు ఫారాలు జిరాక్స్ కేంద్రాలు, ఇతర దుకాణాల్లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ డి సుభాష్ రావు దేశ్ముఖ ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ఫారాలను వార్డు అధికారులు గడపగడపకు వచ్చి ఇస్తారని చెప్పారు. ఎవరైనా బయట విక్రయించినట్లు తమ దృష్టికి వస్తే ఆయా దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..