WNI NEWS జహీరాబాద్ 29 డిసెంబర్ 2023 :: జహీరాబాద్ చెరుకు రైతులు మరియు కర్మాగార కార్మికులు చలో హైదరాబాద్ పేరిట ప్రారంభించిన పాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది. నేటికీ సుమారు 50 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగింది. మధ్యాహ్న భోజనం సదాశివపేట పట్టణంలోని వ్యవసాయ క్షేత్ర ప్రభుత్వ కార్యాలయంలో చేయడం జరిగింది. రైతుల పాదయాత్రకు సంఘీభావంగా సంగారెడ్డికి చెందిన రైతు నాయకులు శ్రీధర్ రెడ్డి గారి బృందం మరియు బిజెపి జహీరాబాద్ పార్లమెంటరీ కన్వీనర్ డాక్టర్ రవికుమార్ గౌడ్ పాదయాత్రలో పాల్గొని రైతులను ఉత్సాహపరిచారు. తెలంగాణ ప్రాంత చక్కెర కర్మాగార రైతుల సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా చక్కెర కర్మాగారాలు నడిపించే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా విన్న పించారు. ఈ పాదయాత్రలో రైతులు, కార్మికులతో పాటు రైతు నేత ఢిల్లీ వసంత్ పాల్గొన్నారు.