- ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ మరియు సెంట్రల్ మినిస్టర్ అయిన కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ మహిళా మోర్చ అసెంబ్లీ కన్వీనర్ జ్యోతి పండాల్
- అండగా ఉంటాను అని హామీ ఇచ్చిన గౌరవనీయులైన సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి
- ఎవ్వరికీ బెదిరె ప్రసక్తే లేదు అంటున్న జ్యోతి పండాల్
WNI NEWS జహీరాబాద్ 29 డిసెంబర్ 2023: బి ఆర్ ఎస్ లీడర్స్ నాయకుల లాగా కాకుండా రౌడీల లాగా ప్రవర్తిస్తున్నారు అని బీజేపీ మహిళా మోర్చ అసెంబ్లీ కన్వీనర్ జ్యోతి పండాల్ మండి పడ్డారు. రాను రాను బీ ఆర్ ఎస్ వాలకి ఆడా మగ అనే విషక్షణా జ్ఞానం మరియు సంస్కారం లేకుండా పోతుంది అని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు. నేను చెరుకు రైతుల కోసం ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీడియా వాలకి ఆ స్టేట్మెంట్ నీ పేపర్ లో ప్రచురించమని కోరడం జరిగింది. వెను వెంటనే గురుతు తెలియని ఒక వ్యక్తి కాల్ చేసి నేను కీజర్ యాఫై అభిమానిని అంటూ ఆ పేపర్ స్టేట్మెంట్ లో మార్పులు చేయాలి అని బెదురింపుకి పాల్పడ్డాడు. బీ ఆర్ ఎస్ వాలు చేతికి గాజులు వేసుకొని ఆడవాల మీద ప్రతాపం చూపించడం తప్ప జహీరాబాద్ నీ అభివృద్ధి చేయడానికి చేతనవ్వడం లేదు ఆమె అన్నారు. మీరు దళితుడు అయిన ఎమ్మెల్యే గారిని అలా చేశారు ఇలా చేశారు అని గొంతు చించుకుoటారు మరి వెనక పడ్డ కులానికి చెందిన నన్ను బెదురించ వచ్చునా అని జ్యోతి పండాల్ ప్రశ్నించారు. మీరు ఎన్ని బెదురింపులు చేయించిన బెదిరే ప్రసక్తే లేదు ఇంకా ప్రజలల్లోకి ముందుకు వెళ్ళి ప్రజల పక్షాన వుండి పోరాడుతాను అని జ్యోతి పండాల్ అన్నారు. చెరుకు రైతుల విషయానికి వస్తే నేను ఈ సమస్యని మోడీ గారి దృష్టికి కైన తీసుకు వెళ్తాను గానీ మిమల్ని చూసి భయపడి వెనకకి తగ్గేదె లేదు అని జ్యోతి పండాల్ బీ ఆర్ ఎస్ పార్టీ నాయకుల మీద విరుచుకు పడ్డారు. ఈ విషయం ఎంపీ మరియు సెంట్రల్ మినిస్టర్ గౌరవనీయులైన కిషన్ రెడ్డి గారి దృష్టికి జ్యోతి పండాల్ తీసుకెళ్లగా నీవు ఎవరికి భయపడాల్సిన అవరం లేదు, నేను నీకు అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు అని జ్యోతి పండాల్ అన్నారు. నాకు పార్టీ పరంగా అన్ని విషయాలలో అండగా ఉన్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ సెంట్రల్ మిన్సిటర్ కిషన్ రెడ్డి గారికి, జిల్లా ప్రెసిడెంట్ అయిన నరేందర్ రెడ్డి గారికి, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీస్ అయిన నౌభాధ్ జగన్ గారికి, అసెంబ్లీ కన్వీనర్ జనార్ధన్ గారికి, మహిందర్ గారికి, మహిళా మోర్చ అక్కలకి, కార్యకర్తలందరికీ నాయొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.