0 7 mths

డబ్ల్యూ ఎన్ ఐ న్యూస్ జహీరాబాద్ 27 మార్చ్ 2024:: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు పెద్ధవారైన పొన్నం ప్రభాకర్ గారూ బీజేపీ పార్టీ మరియు సిట్టింగ్ ఎంపీ అయిన బీబీ పాటిల్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు అని బీజేపీ మహిళా మోర్చ అసెంబ్లీ కన్వీనర్ జ్యోతి పండాల్ అన్నారు. బీ బీ పాటిల్ గారికి తెలంగాణకి ఎటువంటి సంబంధం లేక పోతే వారు రెండు సార్లు జహీరాబాద్ పార్లమెంట్ కి ఎలా ఎంపీ అయ్యారు ప్రజలు ఎందుకు వారిని ఎన్నుకుంటారు. బీబీ పాటిల్ గారు ఉద్యమంలో పోరాడలేదు అని అన్నారు అంటే ఉద్యమంలో పోరాడితేనే నాయకులు అవుతారా మరి మీ పార్టీ లో ఇప్పుడు ఉన్న ఎంతమంది నాయకులు ఉద్యమంలో నుంచి పుట్టుకొచ్చిన వారు ఉన్నారో చెప్పాలని జ్యోతి పండాల్ ప్రశ్నించారు. బీ బీ పాటిల్ గారు బీ ఆర్ ఎస్ పార్టీ లో ఉన్నపుడు కూడా పార్టీలకి అతీతంగా నాకు ఈ సహాయం చేయండి అని వెళ్లిన ప్రతి మనిషికి సహాయం చేశారే తప్ప కొంత మంది ఎమ్మెల్యేల లాగా నీకు సహాయం చేస్తే నాకేంటి లాభం అని అనలేదు. ఇక్కడ జహీరాబాద్ లో కూడా బీ ఆర్ ఎస్ ప్రభుత్వం రాక ముందు మీ కాంగ్రెస్ పార్టీదే నాయకత్వం ఉండే మరి మీ ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ జహీరాబాద్ నీ ఎంత అభి వృద్ధి చేశారో చెప్పాలని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు. మీ ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎన్ని హామీలను ఇచ్చింది మీరు ఇంత వరకు ఎన్ని హామీలను మరియు ఎంత కరెక్ట్ గా అమలు పరిచారో చెప్పాలని జ్యోతి పండాల్ ప్రశ్నించారు. మహిళలకి ఉచిత బస్సు అని చెప్పి ఎదో నామమాత్రంగా ఒక నెల ఆ పతకం నీ నడిపించి ఇప్పుడు అన్ని బస్సులను తీసేసి మళ్ళీ మేమూ అదనపు బస్సులను వెస్తున్నము అని ప్రజలని ఎంపీ ఎలక్షన్స్ కోసం మభ్య పెడుతున్నారు తప్ప ప్రజలకి సేవ చేసే చిత్త శుద్ది మీ ప్రభుత్వానికి లేదు అని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు. మీ ప్రభుత్వం ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నదో అక్కడ ప్రజలకి మరియు ముఖ్యంగా మహిళలకి భద్రత మరియు శాంతి భద్రతలు కరువైయ్యాయీ అని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు. దీనికి మొన్న బెంగళూర్లో మరియు నిన్న చెంగిచర్లలో మహిళల పైన జరిగిన ఘటనలే ఇందుకు ఉదహారణలు. కావున ప్రజలే ఈ ఎంపీ ఎలక్షన్స్ లో మత కల్లోలాలు సృష్టించే కాంగ్రెస్ పార్టీ కావాలా లేక శాంతి భద్రతలను కాపాడే బీజేపీ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని జ్యోతి పండాల్ అన్నారు.